పక్కా ప్లాన్‌తో దూసుకెళ్తున్న మజ్లిస్...!

ABN , First Publish Date - 2020-11-24T17:49:11+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా చార్మినార్‌ నియోజవర్గంలో క్వీన్‌సీప్‌ చేయడానికి మజ్లిస్‌ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చార్మినార్‌ నియోజకవర్గంలోని మొఘల్‌పురా, పురానాపూల్‌, పత్తర్‌ఘట్టీ, శాలిబండాలో మజ్లిస్‌ గెలుపొందగా ఘాన్సీబజార్‌లో బీజేపీ

పక్కా ప్లాన్‌తో దూసుకెళ్తున్న మజ్లిస్...!

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా చార్మినార్‌ నియోజవర్గంలో క్వీన్‌సీప్‌ చేయడానికి మజ్లిస్‌ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చార్మినార్‌ నియోజకవర్గంలోని మొఘల్‌పురా, పురానాపూల్‌, పత్తర్‌ఘట్టీ, శాలిబండాలో మజ్లిస్‌ గెలుపొందగా ఘాన్సీబజార్‌లో బీజేపీ గెలుపొందింది.


గత ఎన్నికల్లో మజ్లిస్‌కు బీజేపీ కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడ్డాయి. మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ చార్మినార్‌ నియోజకవర్గంలోని శాలిబండలో కుమారుడిని, ఘాన్సీ బజార్‌లో భార్యను, పోటీలో నిలిపి పురానాఫూల్‌లో స్వయంగా తాను పోటీ చేసి మజ్లి్‌సకు చెమటలు పట్టించారు. పోలింగ్‌రోజు కూడా ఇరువర్గాలు ఘర్షణ పడడంతో కొన్ని బూత్‌లలో రీపోలింగ్‌ జరిగింది.


గత ఎన్నికల్లో ఘాన్సీబజార్‌లో మజ్లిస్‌ కాంగ్రెస్‌ పార్టీలు ముస్లింల ఓట్లు చీల్చడడంతో ఘాన్సీ బజార్‌లో బీజేపీ గెలుపొందింది అని ఓ విష్లేషణ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న మహ్మద్‌ గౌస్‌ మజ్లీస్‌ పార్టీలో చేరడంతో గౌస్‌ భార్య పర్వీన్‌ సుల్తానాకు ఘాన్సీబజార్‌ టికెట్‌ కేటాయించారు. దీంతో ఇక్కడ పోటీ ఉత్కంఠగా మారింది. గౌస్‌కు ముస్లింలతో పాటు బెంగాలీల్లో, మార్వాడీ వ్యాపారులతో మంచి సంబంధాలు ఉండడంతో ఘాన్సీ బజార్‌ సైతం మజ్లీస్‌ అకౌంట్‌లో పడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


మాజీ కార్పొరేటర్‌ గౌస్‌ కాంగ్రెస్‌ నుంచి మజ్లి్‌సలో చేరడంతో ఈ ఎన్నికల్లో చార్మినార్‌ నియోజకవర్గంలోని పురానాఫూల్‌, శాలిబండ, మోఘల్‌పుర, పత్తర్‌ఘట్టిలలో మజ్లిస్‌ భారీ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది అని ఆ పార్టీనేతలు అంటున్నారు. గతంలోకంటే ఘాన్సీబజార్‌లో మజ్లిస్‌ నాయకులు అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ఓవైసీ సైతం ఎక్కువ సంఖ్యలో ఓట్లున్న వ్యాపారులను సంప్రదిస్తూ తమ పార్టీకి సహకరించాలని కోరుతున్నారు.

Updated Date - 2020-11-24T17:49:11+05:30 IST