వ్యర్థాలతో అధ్వానంగా ప్రధాన పంట కాల్వలు

ABN , First Publish Date - 2021-06-16T06:20:24+05:30 IST

తాగునీరు, సాగునీరు అందించే జిల్లాలోని ప్రధాన పంటకాల్వలు అధ్వా నంగాను, అత్యంత దుర్గంధభరితంగాను ఉన్నాయి.

వ్యర్థాలతో అధ్వానంగా   ప్రధాన పంట కాల్వలు
అమలాపురం రూరల్‌ మండలం ఈదరపల్లి బెండా కెనాల్‌తోపాటు గట్టున పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు

కాల్వల్లో టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం

 ఇలాగే నీటి విడుదలతో కాలుష్యం బారిన ప్రజలు

 పట్టించుకోని అధికార గణం, ప్రజాప్రతినిధులు 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

తాగునీరు, సాగునీరు అందించే జిల్లాలోని ప్రధాన పంటకాల్వలు అధ్వా నంగాను, అత్యంత దుర్గంధభరితంగాను ఉన్నాయి. కాల్వల్లో ఎక్కడచూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పడిపోయిన వృక్షాలు, జారిన గట్లు, ఇరువైపులా ఏపుగా పెరిగిన వృక్షాలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. సాగునీరు పారేందుకు పంట కాల్వల్లో అడుగడుగునా అవరోధాలే. గట్లకు ఇరువైపులా భారీగా పెరిగిన వృక్షాలతో కాల్వల వెడల్పు పూర్తిగా మూసుకుపోయింది. దీని ఫలితంగా సాగునీరు సక్రమంగా శివారు ప్రాంతాలకు అందే పరిస్థితి లేదు. మంగళ వారం జిల్లాలోని ప్రధాన పంటకాల్వలకు సాగునీటిని విడుదల చేశారు. రెండు మూడు రోజుల్లో ఆ సాగునీరు పంటకాల్వల నుంచి అన్ని ప్రాంతా లకు నీరు పారనుంది. సుమారు 430 కిలోమీటర్ల పైబడి ఉన్న పంట కాల్వ ల్లో ప్రధానమైనవి పదికిపైగా కాల్వలు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా చిన్నచిన్న పంటకాల్వలు, బోదెలు వంటివి వందల సంఖ్యలోనే ఉంటాయి. వీటి ద్వారానే శివారు ప్రాంతాల్లోని సాగు భూములకూ నీరు అందాలి. వాస్త వానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 25న కాల్వలను మూసివేశారు. జూన్‌ 1వ తేదీ నాటికి నీటిని విడుదల చేయాల్సి ఉంది. పంటకాల్వలుగాని, ఇతర కాల్వల వద్దగాని ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో జూన్‌ 1న నీటిని విడుదల చేస్తారని రైతులు భావించారు. అయితే అనివార్య పరిస్థితిలో జూన్‌ 15వ తేదీ మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ నీరు శివారు ప్రాంత కాల్వలకు అందాలంటే రెండు మూడు రోజుల పైనే సమయం పట్టవచ్చు. అయితే నీటిని వదిలే ముందు కాల్వల్లో అధ్వాన పరిస్థితులను ఇటు అధికా రులుగానీ, అటు ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోని పరిస్థితి. కాల్వ నీటి ప్రయాణంలో అవన్నీ కొట్టుకుపోవడం సహజమే కదా అంటూ అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు. అయితే ఇటీవల సంభవించిన ఈదురు గాలు లకు చెట్లు పడిపోయి చెత్తాచెదారంతో ముఖ్యంగా టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలకు కాల్వలన్నీ నిండిపోయి ఉన్నాయి. నీటి ప్రవాహంలో లాకుల వద్దకు కొట్టుకుపోయి అక్కడే తిష్టవేసే చెత్తను అప్పుడు తొలగిస్తామంటూ ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కాల్వలకు ఇరువైపులా అక్రమ కట్టడాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కాల్వల్లోనే పిల్లర్లు వేసి షాపులు, ఇళ్ల నిర్మాణాలు చేశారు. ఫలితంగా అక్కడ అధ్వాన పరిస్థితులు నెలకొ న్నాయి. దీనికి తోడు పంటకాల్వల్లోకి ఆయా కాల్వల పక్కనే నివాసం ఉండే వారు మరుగుదొడ్ల గొట్టాలు, డ్రైయిన్ల గొట్టాలు, ఇలా వ్యర్థాలను పంట కాల్వ ల్లోకి విడిచి పెట్టడం వల్ల తాగునీటికి ఉపయోగించే నీరు కలుషితమై అనా రోగ్యాలకు గురిచేసే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ వ్యర్థాలను తొలగించాలని వారంతా కోరుతున్నారు.

Updated Date - 2021-06-16T06:20:24+05:30 IST