సీఎం యోగి పర్యటనలో భద్రతా లోపం...నలుగురు పోలీసుల suspended

ABN , First Publish Date - 2021-10-22T17:53:27+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భారీ భద్రతా లోపం వెలుగుచూసింది...

సీఎం యోగి పర్యటనలో భద్రతా లోపం...నలుగురు పోలీసుల suspended

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భారీ భద్రతా లోపం వెలుగుచూసింది. బస్తీ జిల్లాలో గురువారం జరిగిన బహిరంగ సభ ఆడిటోరియానికి సీఎం యోగి రావడానికి 45 నిమిషాల ముందు లైసెన్సు పొందిన రివాల్వరుతో ఓ వ్యక్తి రావడాన్ని సర్కిల్ ఆఫీసర్ గుర్తించాడని బస్తీ జిల్లా ఎస్పీ ఆశిష్ శ్రీవాస్తవ చెప్పారు. రివాల్వరుతో సీఎం సభ జరిగే ఆడిటోరియానికి వచ్చిన వ్యక్తిని సర్కిల్ ఆఫీసర్ బయటకు తీసుకువెళ్లారు. రివాల్వరుతో వ్యక్తి సీఎం సభ జరిగే ఆడిటోరియానికి రావడంలో ఏడుగురు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నలుగురు పోలీసులను బస్తీజిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.మరో ముగ్గురు పోలీసులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.


Updated Date - 2021-10-22T17:53:27+05:30 IST