న్యూయార్క్‌, న్యూజెర్సీల్లోనే సగం బాధితులు

ABN , First Publish Date - 2020-04-05T08:19:14+05:30 IST

అమెరికాలోని లక్షలాది మంది కరోనా బాధితుల్లో న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల వారే

న్యూయార్క్‌, న్యూజెర్సీల్లోనే సగం బాధితులు

న్యూయార్క్: అమెరికాలోని లక్షలాది మంది కరోనా బాధితుల్లో న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల వారే సగం మంది ఉన్నారని జయశేఖర్‌ చెప్పారు. ఉపాధి కోల్పోయిన వారి కోసం అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన 2.2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన హెచ్‌1బీ వీసా ఉన్న వారు మరో ఉద్యోగంలో చేరేందుకు గతంలో 60 రోజుల సమయం ఉండేదని, దాన్ని 180 రోజులకు పెంచాలని తానాతో పాటు వివిధ సంస్థల ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామని చెప్పారు.


చిన్న వ్యాపారులకు 10 వేల డాలర్ల ఆర్థిక సాయం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. క్రైస్లర్‌, బెడ్‌బాత్‌ వంటి భారీ కంపెనీలు ప్రకటించిన లాక్‌డౌన్‌తో హెచ్‌1బీ వీసాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారి కోసం తానా ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామని జయశేఖర్‌ చెప్పారు. మూసేసిన వివిధ యూనివర్సిటీల్లోని హాస్టల్‌ విద్యార్థులకు బయట వసతి సౌకర్యం కల్పించామన్నారు. నిధులు సేకరించి అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కరోనా బాధితులను ఆదుకుంటామని చెప్పారు. అమెరికాలో ఆపదలో ఉన్న తెలుగువారు తానా హెల్ప్‌లైన్‌ 1855-్ౖఖఖఖీఅూఅ నంబరును సంప్రదించాలని జయశేఖర్‌ సూచించారు. 

Updated Date - 2020-04-05T08:19:14+05:30 IST