carona మృతుల్లో ఎక్కువమంది టీకాలు వేయించుకోని వ్యక్తులే...

ABN , First Publish Date - 2022-01-14T18:16:12+05:30 IST

కొవిడ్ మరణాల్లో ఎక్కువ మంది టీకాలు వేయించుకోని వ్యక్తులేనని వైద్యనిపుణులు తేల్చారు....

carona మృతుల్లో ఎక్కువమంది టీకాలు వేయించుకోని వ్యక్తులే...

వైద్యుల వెల్లడి

న్యూఢిల్లీ : కొవిడ్ మరణాల్లో ఎక్కువ మంది టీకాలు వేయించుకోని వ్యక్తులేనని వైద్యనిపుణులు తేల్చారు. కేన్సర్, కిడ్నీ, మధుమేహం లాంటి తీవ్రమైన కొమొర్బిడ్ అనారోగ్యాలు ఉన్నవారు కరోనా బారినపడితే ఎక్కువ ప్రమాదంలో పడి రెండు రోజుల్లోనే మరణిస్తున్నారని వైద్యులు చెప్పారు. కొవిడ్ బారిన పడి అత్యధిక మరణాల్లో తీవ్రమైన వ్యాధులున్న వారని డెత్ ఆడిట్ కమిటీ తాజా నివేదికలో వెల్లడించింది. తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరిన వారు కరోనా బారిన పడ్డారని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. ఈ నెల 9 నుంచి 12వతేదీల మధ్య ఢిల్లీ ఆసుపత్రుల్లో 97 మంది మరణించగా వారిలో కేవలం 8 మందికి మాత్రమే కొవిడ్ టీకాలు వేయించుకున్నారని తేలింది. 


టీకాలు వేయించుకున్న వారు తేలికపాటి లక్షణాలతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని వైద్యులు చెప్పారు. కరోనా మృతుల్లో 70 శాతం మంది ఎలాంటి వ్యాక్సిన్లు తీసుకోలేదని వైద్యులు చెప్పారు. కరోనా మృతుల్లో 34 మందికి దీర్ఘకాల వ్యాధులున్నాయని తేలింది. కొంతమంది కరోనా రోగులు ఆలస్యంగా ఆసుపత్రులకు రావడం వల్లనే మృత్యువాత పడుతున్నారని వైద్యులు చెప్పారు. 


Updated Date - 2022-01-14T18:16:12+05:30 IST