అప్పులు చేస్కోండి

ABN , First Publish Date - 2020-09-25T08:16:25+05:30 IST

ఆర్థికంగా కటకటలాడుతున్న ఏపీకి కేంద్రం నిర్ణయం ఊరట ఇచ్చింది. ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, గోవా, త్రిపుర మొదలైన

అప్పులు చేస్కోండి

ఏపీకి 2,525 కోట్ల పరిమితితో కేంద్రం అనుమతి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్ర జ్యోతి): ఆర్థికంగా కటకటలాడుతున్న ఏపీకి కేంద్రం నిర్ణయం ఊరట ఇచ్చింది. ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, గోవా, త్రిపుర మొదలైన ఐదు రాష్ర్టాలు రూ.9,913కోట్లు మేర అదనపు అప్పులు సేకరిం చుకోడానికి కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ గురువారం అనుమతించింది.


ఇందులో ఏపీకి రూ.2,525కోట్లు, తెలంగాణకు రూ.2,508కోట్లు, కర్ణాటకకు రూ.4,509కోట్లు, గోవాకు రూ.223 కోట్లు, త్రిపురకు రూ.148కోట్ల వంతున అదనపు రుణాలను పొందే అవకాశం లభించింది. కొవిడ్‌ దృష్ట్యా  స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 2ు మేరకు రాష్ట్రాలు అప్పులు చేసుకునేందుకు మే నెలలో కేంద్రం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.


అయితే.. ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు’, సులభతర వ్యాపార సంస్కరణలు, పట్టణ - స్థానిక వినియోగ సంస్కరణలు, విద్యుత్తు రంగ సంస్కరణలను అమలు చేస్తేనే ఈ అనుమతులు లభిస్తాయని ప్రకటించింది. ప్రతి సంస్కరణకు జీఎ్‌సడీపీలో 0.25ు మేరకు అ ప్పులకు అనుమతినిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఐదు రాష్ట్రాలకు కేంద్రం అనుమతులు లభించాయి. 


Updated Date - 2020-09-25T08:16:25+05:30 IST