క్యాడర్‌ కేటాయింపులో తప్పులు దొర్లొద్దు

ABN , First Publish Date - 2021-12-08T04:50:57+05:30 IST

రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాలమేరకు ఉద్యోగులకు సంబంధించి స్థా నిక క్యాడర్‌ కేటాయింపుల విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు.

క్యాడర్‌ కేటాయింపులో తప్పులు దొర్లొద్దు
సైనికులకు తన వంతు సహాయం అందిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

- కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు


మహబూబ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 7 : రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాలమేరకు ఉద్యోగులకు సంబంధించి స్థా నిక క్యాడర్‌ కేటాయింపుల విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉద్యోగుల స్థానిక క్యా డర్‌ కేటాయింపుపై జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగుల స్థానిక క్యాడర్‌ కేటా యింపు విషయంలో ప్రభుత్వ ఆదేశాలను తప్పకుం డా అమలు చేయాలని, ఇందుకు జిల్లా అధికారులు అందరు సహకరించాలని కోరారు. ఈనెల 6న ప్రభు త్వం 317 జీవో జారీ చేసినట్లు వెల్లడించారు. బుధ వారం సాయంత్రం లోపు అన్ని క్రోడీకరించి ప్రభు త్వం నిర్ధేశించిన వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఇందుకుగాను ముందుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరీల వారీగా ఉద్యోగుల సీనియార్టీ జాబి తాను రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధి రాజీవ్‌రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్‌ తరుఫున రాజగోపాల్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికారులు వారివారి అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా, కొన్ని విషయాల్లో సూచనలు, సలహాలు అందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారా మారావు, జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు చెన్నకిష్టన్న, రాజేష్‌, ఎన్‌జీవోల కార్య దర్శి చంద్రానాయక్‌, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌ సమావేశానికి హాజరయ్యారు.  


 కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు కలగొద్దు 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడు తూ ఓబీఎంఎస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ధాన్యం అ మ్మిన రైతులకు తక్షణమే వారి అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలన్నారు. ధాన్యం తరలింపులో రవాణా స మస్య తలెత్తవద్దని సూచించారు. గన్నీ బ్యాగుల కొర త లేకుండా చూసుకోవాలని, కిలో మించి తరుగు తీ స్తే చర్యలు తీసుకుంటానని కేంద్రాల నిర్వాహకులను హెచ్చరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారా మారావు, వ్యవసాయ అధికారిని సుచరిత, డీఆర్‌డీఓ యాదయ్య, డీసీ వో సుధాకర్‌, డీఎస్‌వో వనజాత, డీ ఎం జగదీశ్‌ తదితరులు హాజరయ్యారు.


 చిరుధాన్యాలు సాగు చేయాలి

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : రైతులు రబీ సీజన్‌లో  చిరుధాన్యాలు సాగు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌ రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఇప్పల పల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రబీ సా గుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్‌ హాజరై, మాట్లాడారు. అనంతరం రబీ సీజన్‌ లో లాభసాటి పంటలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ ను విడుదల చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పాండు, వ్యవసాయ అధికారి హస్రత్‌ సుల్తానబేగం, సర్పంచ్‌ వెంకటయ్య, అధికారులు పాల్గొన్నారు. 


 రేషన్‌ వినియోగదారులందరికీ వ్యాక్సిన్‌

చౌకధరల దుకాణాల వినియోగదారులందరికీ వ్యా క్సిన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు అన్నారు. మంగళవారం ఆ యన తన చాంబర్‌ నుంచి చౌకధరల దుకాణాల డీల ర్లు, తహసీల్దార్లతో వ్యాక్సినేషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్ట ణాలు, గ్రామాల్లో వ్యాక్సిన్‌ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్‌ వేసుకునేలా చైతన్యం చేయాలని కోరారు. జి ల్లా పౌరసరఫరాల అధికారి కోట్ల వనజాత, డీఎం జగ దీష్‌ తదితరులు వీసీకి హాజరయ్యారు. 


 సైనికులకు సహకారం అందించాలి

దేశ రక్షణలో భాగంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపలా కాస్తున్న సైనికులకు సహకారం అందిం చాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. సైనికదళాల పతాక దినోత్స వాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన మహ బూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పరిషత్‌ సమావేశమం దిరంలో తన వంతు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి టి.వనజ, జిల్లా అధి కారులు పాల్గొన్నారు.


 సైనిక కుటుంబ సభ్యులకు సన్మానం 

సైనిక పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో విధి నిర్వహణలో ప్రాణాల ర్పించిన సైనిక కుటుంబ సభ్యులను మంగళవారం సన్మానించినట్లు అధికారి వనజ తెలిపారు. మాజీ సైనికుల సంఘం సభ్యులు ప్రసాద్‌, ఎన్‌సీసీ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-12-08T04:50:57+05:30 IST