Abn logo
Sep 26 2021 @ 23:44PM

నేటి భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి

భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

రాయచోటి, సెప్టెంబరు26:  రైతుల నడ్డివిరిచే మూడు నల్లచట్టాలను రద్దు చేయాలంటూ గత 9 నెలలుగా దేశవ్యాప్తంగా చేస్తున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా సోమవారం జరుగుతున్న భారత్‌బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని రైతు సమన్వయ కమిటీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం అంబేడ్కర్‌ ప్లెక్సీ వద్ద జరిగిన సమావేశంలో రైతు సమన్వయ కమిటీ నాయకులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్‌, ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయకులు రామాంజులు, వడ్డెర విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ జీవానందం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఎస్‌ఎ్‌ఫఐ వినోద్‌కుమార్‌, స్వచ్చంధ సంస్థల నాయకులు సురేంద్రారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ నాయకులు నాగమునిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ వేణుగోపాల్‌రెడ్డి, మహమ్మద్‌రఫీ తదితరులు పాల్గొన్నారు. సోమవారం జరగబోయే భారత్‌బంద్‌కు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు, రాజకీయ పార్టీలు, వ్యాపారులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.