Advertisement
Advertisement
Abn logo
Advertisement

శిక్షణ తరగతులను విజయవంతం చేయండి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి


వనపర్తి అర్బన్‌, డిసెంబరు 2: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ఈనెల 5, 6, 7వ తేదీల్లో కొత్తకోట మండలం పామాపురం వద్ద జిల్లాస్థాయి శిక్షణ తరగ తులు నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్ట ణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. సమా వేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ తరగతుల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీని బలోపేతం చేసే విషయాలపై చర్చ ఉంటుందని తెలిపారు. శిక్షణ తరగతులకు పార్టీ మండ లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల మోర్చా అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ స భ్యులు, జిల్లా పదాధికారులు హాజరవుతారని వివరించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ చార్జి బోసుపల్లి ప్రతాప్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారు ప్రభాకర్‌రెడ్డి, బి.కృష్ణ, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు మున్నూరు రవీందర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాధవరెడ్డి, రామన్‌గౌడ్‌, నాయకులు పరుశురాములు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement