Abn logo
Sep 24 2021 @ 00:50AM

శ్మశానానికి దారి ఇప్పించండి


- చంటిబిడ్డ మృతదేహాన్ని 

శ్మశానానికి తీసుకెళ్లడానికి ఇబ్బందిపడ్డ బంధువులు

శింగనమల, సెప్టెంబరు23 : ఆ గ్రామంలో ఎవరైనా మృతి చెందితే శ్మశానానికి దారిలేదు. ముళ్లకంపల్లో తీసుకెళ్లాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని నాగులగుడ్డం గ్రామంలో పూర్వం నుంచి శ్మ శానం ఉంది. అప్పటికే ఆ గ్రామపెద్దలు శ్మశానానికి దారి వదిలా రు. దానిని కొందరు గ్రామస్థులు ఆక్రమించారు. పలుమార్లు రెవెన్యూ అధికారులు పరిశీ లించి, ఆదేశించినా ప్రయోజనం లేదు.  గ్రామానికి చెందిన హేమలత అనే మ హిళ రెండు నెలల చిన్నారి గురువారం మృతి చెందాడు. మృతదేహాన్ని శ్మశా నానికి తీసుకెళ్లేందుకు దారిలేక అక్కడే ముళ్లకంప లున్న ప్రాంతంలో ఖననం చేశారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.