కనురెప్పలపై ఈ క్రీమ్ రాస్తే లుక్‌ అదిరిపోతుంది..

ABN , First Publish Date - 2020-10-26T17:05:34+05:30 IST

కాలం విచిత్రంగా మారింది. ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియడమే లేదు.

కనురెప్పలపై ఈ క్రీమ్ రాస్తే లుక్‌ అదిరిపోతుంది..

కాలం విచిత్రంగా మారింది. ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియడమే లేదు. రోజంతా తాజాగా ఉండేందుకు ఎలాంటి మేకప్‌ చిట్కాలు పాటించాలో అర్థం కాక యువతులు తికమక పడుతున్నారు. అవసరమైనదీ అవసరం లేనిదీ తమ బ్యాగుల్లో నింపేసుకుంటున్నారు. ఎలాంటి ఎమర్జెన్సీలో అయినా అవసరమయ్యే బ్యూటీ ప్రాడక్ట్స్‌ ఏడే ఏడు... ఇవి మీ బ్యాగులో సర్దుకుంటే చాలు.


ఫేస్‌ మిస్ట్‌: ఎండలో తిరిగినా, ఆఫీసులో ఏసీలో కూర్చున్నా కూడా లంచ్‌ టైమ్‌ కంతా ముఖం వాడిపోతుంది. డీలా పడుతుంది. అందుకే మధ్యాహ్నం ఓసారి ఫేస్‌ మిస్ట్‌ని స్ర్పే చేస్తే చాలు. వెంటనే అలసట మటుమాయం. 


కాంపాక్ట్‌ పౌడర్‌: అద్దంతో పాటు స్పాంజ్‌ ఉండే కాంపాక్ట్‌ పౌడర్‌ బాక్స్‌నే తీసుకోవాలి. ఎక్కడైనా సరే అద్దంలో ముఖం చూసుకుంటూ పౌడర్‌ అద్దుకోవచ్చు. దీనివల్ల ముఖం తాజాగా వెలిగిపోతుంది.


లిప్‌ క్రీమ్‌: ఎప్పటి కప్పుడు ఫ్రెష్‌నెస్‌ కోసం పెదాలపై రాయొచ్చు. చెక్కిళ్లపై, కనురెప్పలపై కూడా కాస్త రాస్తే లుక్‌ అదిరిపోతుంది.


సన్‌ స్ర్కీన్‌ స్ర్పే: ఆఫీసులో ఉన్నా కూడా మధ్యాహ్నం ముఖం కడుక్కునే అలవాటు చాలా మందికి ఉంటుంది. దాంతో ఉదయం రాసుకున్న సన్‌స్ర్కీన్‌ లోషన్‌ పోతుంది. అందుకే చిన్నపాటి సన్‌స్ర్కీన్‌ స్ర్పే బ్యాగులో పెట్టుకోండి. ముఖం కడిగిన వెంటనే ఓసారి స్ర్పే చేసుకుంటే చాలు ఎండలో తిరిగినా నో ప్రాబ్లమ్‌.


హ్యాండ్‌ క్రీమ్‌: ముఖంపై ఉన్న శ్రద్ధలో ఓ పది శాతం కూడా చేతులపై ఉండదు. అందుకే యుక్త వయసు దాటాక చేతులు ముడతలు పడి సాగదీసినట్టుగా మారతాయి. ప్రస్తుత శానిటైజర్ల వల్ల కూడా చేతులు తొందరగా డ్రై అవుతున్నాయి. చేతుల్ని ఎప్పటికప్పుడు క్రీమ్‌లు రాసి చేతుల్ని పొడిబారకుండా రక్షించాలి.


మస్కారా: మీరు మస్కారా ప్రియులు కాకపోయినా ఐ లైనర్‌ కంటే కూడా చిన్నపాటి మస్కారాని బ్యాగ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే కళ్లతోనే మొదటి సంభాషణ ప్రారంభమవుతుంది. కళ్ల రెప్పల్ని తీర్చిదిద్దుకుంటే చాలు మీ తాజాదనం రెట్టింపవుతుంది.  


ఓ చిన్న సెంట్‌ సీసా: పర్‌ఫ్యూమ్‌లనేవి ప్రత్యేక రోజులకే అనుకుంటే పొరపాటే. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, హుషారుగా ఉంచే సాధనం పర్‌ఫ్యూమ్‌. సిట్రస్‌ సంబంధ సెంట్‌లనే వినియోగించడం అన్ని వేళలా మంచిది.  

Updated Date - 2020-10-26T17:05:34+05:30 IST