Abn logo
May 23 2020 @ 04:27AM

రైతాంగాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదు

కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి


ధర్మపురి, మే 22: రైతాంగాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యలు చేయ డం సరికాదని కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ధర్మ పురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవం త్‌రెడ్డి పరామర్శల పేరుతో తిరుగుతూ సీఎం కేసీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలన్నారు.


సీఎం కేసీఆర్‌ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మం డిపడ్డారు. పంటల సాగు, రైతుబంధు పథకం గురించి విపక్షాలు అడ్డుపడుతూ రైతులను తికమకలు పెట్టుతున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, వైస్‌ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.   

Advertisement
Advertisement