వేడి నీరు తేలిక

ABN , First Publish Date - 2020-02-23T06:18:50+05:30 IST

ఒక సీసాలో వేడి నీటిని నింపండి. అందులో ఎరుపు సిరా వేయండి. రెండో సీసాలో చల్లని నీరు నింపండి. ఇప్పుడు పలుచని అట్టముక్కను సీసా మూతి మీద పెట్టండి.

వేడి నీరు తేలిక

కావలసినవి

  • ఖాళీ సీసాలు రెండు
  • చల్లటి నీరు
  • వేడి నీరు
  • ఎరుపు సిరా 
  • అట్టముక్క

ఒక సీసాలో వేడి నీటిని నింపండి. అందులో ఎరుపు సిరా వేయండి. రెండో సీసాలో చల్లని నీరు నింపండి. ఇప్పుడు పలుచని అట్టముక్కను సీసా మూతి మీద పెట్టండి. వేళ్లతో అట్టను గట్టిగా నొక్కి పట్టి మొదటి సీసా మీద బోర్లించండి. రెండు సీసాల మూతులు సమానంగా కలిసిన తరువాత నెమ్మదిగా అట్టముక్కను లాగేయండి. ఇప్పుడు రెండు సీసాలలోని నీళ్లు కలవడం మొదలవుతుంది. మనం చూస్తుండగానే కింద సీసాలో ఉన్న రంగు నీళ్లు పైసీసాలోకి, పైసీసాలో ఉన్న రంగులేని నీళ్లు కింది సీసాలోకి వస్తాయి. చల్లటి నీళ్లకన్నా వేడి నీళ్ల సాంద్రత తక్కువ ఉంటుంది. అందుకే ఇలా జరుగుతుంది.

Updated Date - 2020-02-23T06:18:50+05:30 IST