ఎలుగుబంటిని చేద్దామా!

ABN , First Publish Date - 2020-05-23T05:30:00+05:30 IST

టాయిలెట్‌ పేపర్‌ రోల్, ఫోమ్‌ షీట్‌తో ఎలుగు బంటి బోమ్మ తయారీ...

ఎలుగుబంటిని చేద్దామా!

కావలసినవి

  1. టాయిలెట్‌ పేపర్‌ రోల్‌
  2. బ్రౌన్‌ కలర్‌ ఫోమ్‌ షీట్‌
  3. పింక్‌ ఫోమ్‌ షీట్‌
  4. గూగ్లీ కళ్లు
  5. జిగురు
  6. కత్తెర.


తయారీ

  1. టాయిలెట్‌ పేపర్‌ రోల్‌ చుట్టూ కవర్‌ అయ్యేలా బ్రౌన్‌ కలర్‌ ఫోమ్‌ షీట్‌ను కట్‌ చేసుకోవాలి. తరువాత జిగురు సహాయంతో అతికించాలి. 
  2. పింక్‌ ఫోమ్‌ షీట్‌తో రెండు హార్ట్‌ షేపులు కట్‌ చేయాలి. ఒకటి కాస్త పెద్దగా ఉండాలి. మరొకటి  చిన్నగా ఉండాలి. 
  3. చిన్నగా ఉన్న హార్ట్‌షేప్‌ ముక్కు భాగంలో అతికించాలి. పెద్దది బేర్‌ చేతుల్లో ఉండే విధంగా అతికించాలి.
  4. ఇప్పుడు బ్రౌన్‌ ఫోమ్‌ షీట్‌ తీసుకొని బేర్‌ తల, చేతులు, కాళ్లు డ్రా చేసి, కట్‌ చేయాలి. పింక్‌ షీట్‌ను రెండు చిన్న వృత్తాలుగా కట్‌ చేసి, కాళ్లపై అతికించాలి. తల, చేతులు, కాళ్లను పేపర్‌ రోల్‌కు అతికించాలి.
  5. గూగ్లీ కళ్లను అతికించాలి. బ్లాక్‌ స్కెచ్‌ సహాయంతో నోరు గీయాలి. అంతే... ఎలుగుబంటి బొమ్మ రెడీ. 

Updated Date - 2020-05-23T05:30:00+05:30 IST