టెలీ మెడిసిన్‌ మండలంగా ‘మక్తల్‌’

ABN , First Publish Date - 2020-04-09T09:50:33+05:30 IST

ఏకం గా ఒక మండలమంతా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ వైద్య సేవలను పరిచయం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించనుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటా), డిజిథాన్‌ సంయుక్త కృషితో

టెలీ మెడిసిన్‌ మండలంగా ‘మక్తల్‌’

  • దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ వైద్యసేవలు 
  • ప్రారంభించిన చినజీయర్‌ స్వామి

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 8 : ఏకం గా ఒక మండలమంతా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ వైద్య సేవలను పరిచయం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించనుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటా), డిజిథాన్‌ సంయుక్త కృషితో నారాయణపేట జిల్లా మక్తల్‌ మం డలంలో సమగ్ర టెలీమెడిసిన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘టీ కన్సల్ట్‌’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టును చినజీయర్‌ స్వామి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరిచంద నతో ఆయన మాట్లాడారు. ‘టీ కన్సల్ట్‌’ ద్వారా మక్తల్‌ పరిధిలోని 39 గ్రామ పంచాయతీలకు ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందుతాయని కలెక్టర్‌ వెల్లడించారు. ఇప్పటివరకు తమ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చినజీయర్‌ స్వామికి కలెక్టర్‌ వివరించారు.  

‘జిమ్స్‌’ ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ 

శంషాబాద్‌లోని చినజీయర్‌స్వామి జిమ్స్‌ హోమియోపతి వైద్య కళాశాల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లావ్యాప్తంగా రోగ నిరోధక శక్తిని పెంచే హోమియో మాత్రల పంపిణీ ప్రారంభమైంది. తొలివిడతగా నారాయణపేటలోని మూడోవార్డు, అప్పంపల్లి గ్రామంలో బుధవారం పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-09T09:50:33+05:30 IST