Oct 17 2021 @ 19:12PM

నిక్ నేమ్ చెప్పి జడ్జీలను ఆశ్చర్యానికి గురి చేసిన మలైకా అరోరా

ప్రతి ఒక్కరికి నిక్ నేమ్ ఉంటుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలు అందుకు మినహాయింపు ఏమీ కాదు. ప్రేక్షకులు అభిమానంతో వారిని ఒక పేరుతో పిలుస్తారు. కుటుబసభ్యులు, సన్నిహితులు మరో పేరుతో పిలుచుకుంటారు. తాజాగా ఒక రియాలిటీ షోలో ‘‘ కెవ్వు కేక’’ భామ తన నిక్ నేమ్ ను వెల్లడించింది. 


గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు‌కేక పాటలో కనిపించి అభిమానుల మదిని దోచిన ఐటమ్ భామ మలైకా అరోరా. ‘‘ ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్-2’’ షోకు ఆమె జడ్జీగా వ్యవహరిస్తోంది. ఆమెతో సహా గీతా కపూర్, టెరెన్స్ లూయిస్ కూడా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. నాగాలాండ్‌కు చెందిన మేయితేంసు నాగ అనే వ్యక్తి అడిషన్ రౌండ్‌లో తన ఫర్ ఫార్మెన్స్‌తో జడ్జీలను మంత్రముగ్ధుల్ని చేశారు. తనకు హిందీ రాదని, కేవలం ఇంగ్లీష్, నాగమీస్ మాట్లాడతానని చెప్పారు. తన పేరు పలకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ‘‘మీ’’ అనే పేరుతో పిలవాలని చెప్పారు. ‘‘ మీ ’’అనేది తన నిక్ నేమ్ అని వివరించారు. 


అతడు ఆ విధంగా చెప్పడంతో మలైకా కూడా ఇంటిలోని వారు తనను ‘‘మిమి’’ అని పిలుస్తారని చెప్పింది. అదే తన నిక్ నేమ్ అని వివరించింది. తన నిక్‌నేమ్‌ను మలైకా చెప్పడంతో జడ్జీలు ఆశ్చర్చానికి లోనయ్యారు. ఎందుకంటే ఆమె నిక్ నేమ్ క్లోజ్ ఫ్రెండ్స్‌తో  సహా జడ్జీలకు కూడా తెలియదు. ఇండియస్ బెస్ట్ డ్యాన్సర్ -2 షో సోనీ టీవీలో ప్రసారం అవుతోంది. మలైకా అరోరా గతంలోనే అర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా కరోనా సమయంలో ఇద్దరూ ఒకే ఇంటిలో నివాసమున్నారు.

Bollywoodమరిన్ని...