Oct 23 2021 @ 19:07PM

‘వాళ్ల’కంటే నాకు ‘నా సంతోషమే‘ ముఖ్యం అంటోన్న Malaika Arora

సల్మాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ మాజీ భార్య, హీరో అర్జున్ కపూర్ ప్రియురాలు మలైకా అరోరా. బాలీవుడ్‌లో ఫిట్‌నెస్ అనగానే గుర్తొచ్చే మొదటి రెండు, మూడు పేర్లలో ఈమె నేమ్ కూడా ఉంటుంది. అంతలా సూపర్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది, ఈ 48 ఏళ్ల హాట్ బ్యూటీ. తెలుగులోనూ ఒకట్రెండు ఐటెం సాంగ్స్ చేసిన ఈ ‘కెవ్వు కేక’ సుందరి తాజాగా తనపై నడిచే ఆన్‌లైన్ ట్రోల్స్ గురించి స్పందించింది. 


‘‘ట్రోల్స్‌ను భరించటం నిజంగా పెద్ద సవాలే. కానీ, గత కొన్ని సంవత్సరాల కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే... వాట్ని అసలు మన దగ్గరకు రానీయకపోవటమే ఉత్తమైన మార్గం...’’ అంటోంది మలైకా. సొషల్ మీడియాలో తన గురించి రకరకాలుగా మాట్లాడే వారి కామెంట్స్ అసలు ఆమె చదవనే చదవదట! వాట్ని పట్టించుకోకపోవటమే తగిన పద్ధతని ఆమె డిసైడ్ అయిపోయిందట. 


ఎదుటి వారికి తన మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి... వాట్ని పట్టించుకుంటూ కూర్చుంటే మన: శాంతి లోపిస్తుందని చెప్పిన మలైకా అరోరా, ‘‘ఇతరులకు నా గురించి ఉండే అభిప్రాయం కంటే కూడా నాకు నా సంతోషమే ముఖ్యం’’ అని తేల్చేసింది. తనకంటే వయస్సులో చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ఈ సీనియర్ బ్యూటీ లవ్ ఎఫైర్ ఆన్‌లైన్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. దానిపై చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అటువంటి ట్రోల్స్ గురించే మలైకా ఈ విధంగా స్పందించింది... 

Bollywoodమరిన్ని...