నటరాజాసనంతో బ్యాలెన్సింగ్‌!

ABN , First Publish Date - 2020-11-05T05:30:00+05:30 IST

ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించే వారు యోగాసనాలను సాధన చేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయి. నటరాజాసనంతో తొడ, తుంటి భాగంలోని కండరాలు, వెన్నెముక దగ్గర్లోని కండరాలు దృఢంగా మారుతాయి. ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్‌ భామ మలైకా ఆరోరా...

నటరాజాసనంతో బ్యాలెన్సింగ్‌!

ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించే వారు యోగాసనాలను సాధన చేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయి. నటరాజాసనంతో తొడ, తుంటి భాగంలోని కండరాలు, వెన్నెముక దగ్గర్లోని కండరాలు దృఢంగా మారుతాయి. ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్‌ భామ మలైకా ఆరోరా తిరిగి ఫిట్‌నెస్‌ సాధించేందుకు నటరాజాసనం సాధన చేస్తున్నారు. 


  1. ముందుగా నేలపై నిటారుగా నిల్చోవాలి. ఒక పొడవైన కర్రను కుడి చేతితో పట్టుకోవాలి. 
  2. ఇప్పుడు శ్వాస తీసుకొని, ఎడమ మోకాలిని వెనక్కి వంచాలి.
  3. శ్వాస వదులుతూ ఎడమ చేతితో ఎడమ కాలును పట్టుకొని కొద్దిగా పైకి తీసుకురావాలి.
  4. ఎడమ పాదం సీలింగ్‌ వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. మోకాలుతో శరీరం మీద వ్యతిరేకదిశలో ఒత్తడి పెంచాలి.
  5. ఈ భంగిమలో 10 నుంచి 15 సెకన్ల పాటు ఉండి, యథాస్థానానికి రావాలి.

Updated Date - 2020-11-05T05:30:00+05:30 IST