Abn logo
May 22 2020 @ 10:42AM

యువరాణిలా నటించాలని ఉంది: మాళవిక మోహనన్‌

మలయాళం నుంచి కోలీవుడ్‌కి వచ్చిన యువతార మాళవిక మోహనన్‌ ప్రస్తుతం తమిళ యూత్‌కు ఫేవరెట్‌గా మారింది. తొలుత ‘పేట్ట’లో రజనీకాంత్‌తో కలిసి నటించిన మాళవిక.. రెండో చిత్రం ‘మాస్టర్‌’లోనే విజయ్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది. అలాగే సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉన్న మాళవిక తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఆ సందర్భంగా మీ డ్రీమ్‌ క్యారెక్టర్‌ ఏంటి అని ఓ అభిమాని అడుగగా.. యువరాణి లేదా మహారాణి పాత్రలో నటించాలని ఉందని చెప్పింది.

Advertisement
Advertisement
Advertisement