మాళవిక శర్మ ఖాళీగా ఉందా..?

యంగ్ బ్యూటీ మాళవిక శర్మ ప్రస్తుతం ఖాళీగా ఉందని సమాచారం. చేసిన రెండు సినిమాలు ఆశించిన విజయాలను అందుకోకపోవడంతో అమ్మడి కెరీర్ ఇప్పుడు డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఈమె డెబ్యూ సినిమా మాస్ మహారాజ రవితేజతో చేసింది. 'నేల టికెట్' టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. దీని తర్వాత రామ్ హీరోగా వచ్చిన 'రెడ్'లో నటించింది. ఇందులో మాళవిక శర్మ మంచి పాత్రే పోషించింది. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ క్రేజీ ఆఫర్ వచ్చి హిట్ అందుకుంటే తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశగా ఎదురు చూస్తుందట. మరి ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Advertisement
Advertisement