Advertisement
Advertisement
Abn logo
Advertisement

పురుషులకు, మహిళలకు ఒకే కండోమ్.. ప్రపంచంలోనే తొలిసారిగా..

ఇంటర్నెట్ డెస్క్: గర్భనిరోధక సాధనాల్లో అత్యంత సురక్షితమైనవి కండోమ్స్. ఇవి ప్రధానంగా పురుషులకు ఉద్దేశించినప్పటికీ..మహిళల కోసం రూపొందించిన కండోమ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా పురుషులు, మహిళలు కూడా వాడగలిగే ఓ కొత్త తరహా కండోమ్ తాజాగా తెరపైకి వచ్చింది.  మలేషియాకు చెందిన గైనకాలజిస్టు టాంగ్ ఈ కండోమ్‌ను రూపొందించారు. ఆయన సారథ్యంలోని వాండలీఫ్ అనే కంపెనీ వీటిని తయారు చేస్తోంది. 

ఈ కండోమ్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయని దీని రూపకర్త టాంగ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. సాధారణంగా కండోమ్స్ లేటెక్స్‌ అనే పదార్థంతో తయారు చేస్తే ఈ యూనీసెక్స్ కండోమ్‌ను మాత్రం పాలీయూరెథేన్‌తో తయారైంది. గాయాలకు చేసే.. డ్రెస్సింగ్ మెటీరియల్ పాలీయూరెథేన్‌తోనే తయారవుతాయన్న విషయం తెలిసిందే. ఇక లేటెక్స్‌ అంటే పడని (అలర్జీ రీత్యా) వాళ్లను కూడా పరిగణలోకి తీసుకుని దీన్ని పాలీయూరెథేన్‌తో రూపొందించామని టాంగ్ పేర్కొన్నారు. ఈ కండోమ్‌కు వెనకవైపు జిగురు ఉన్న పొరను కూడా ఏర్పాటు చేయడంతో ఇది చర్మానికి అంటుకునే ఉంటుందని,  శృంగార సమయంలో జారి పోదని టాంగ్ పేర్కొన్నారు.

పురుషులు ఈ కండోమ్‌ను యథాతథంగా వాడుకోవచ్చు. మహిళలు మాత్రం దీన్ని తిరగేసి వినియోగించాల్సి ఉంటుంది. ఇతర గర్భనిరోధక సాధనాలతో అనేక మందిలో ప్రతికూలతలు కలగడం గమనించి తాను ఈ కొత్త తరహా కండోమ్ రూపొందించానని టాంగ్ తెలిపారు. ఇది ‘లైంగిక వివక్షకు’ తావులేనిదని కూడా వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం మలేషియా వాసులకే ఇది అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తుల్లో ప్రపంచమంతా లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు టాంగ్ పేర్కొన్నారు. ఇటీవల బ్రెజిల్‌లో ఓ రెస్టారెంట్ వాళ్లు పురుషులు, మహిళల కోసం ఒకే టాయ్‌లెట్ ఏర్పాటు చేసి సామ్యవాదం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పుకున్న విషయం తెలిసిందే. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement