సముద్రగర్భంలో మంత్రివర్గ సమావేశం

ABN , First Publish Date - 2021-05-10T06:03:26+05:30 IST

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గం సమావేశం కావడం తెలిసిందే. అలాగే మాల్దీవుల్లో కూడా అక్కడి మంత్రివర్గం సమావేశం అయింది...

సముద్రగర్భంలో మంత్రివర్గ సమావేశం

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గం సమావేశం కావడం తెలిసిందే. అలాగే మాల్దీవుల్లో కూడా అక్కడి మంత్రివర్గం సమావేశం అయింది. అయితే దాని ప్రత్యేకత ఏమిటంటారా? ఈ సమావేశం సముద్రగర్భంలో జరిగింది. అదెలా అంటారా? అయితే చదవండి.


  1. మాల్దీవులు... ఒక చిన్నదేశం. సముద్రగర్భంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన మొదటి దేశం కూడా ఇదే.  చుట్టూ సముద్రం... అక్కడక్కడా దీవులు.... వెరసి పర్యాటకులకు స్వర్గధామం ఈ ప్రదేశం. 
  2. ఈ దీవుల్లో వాతావరణంలో మార్పుల వల్ల సముద్రం మట్టం పెరిగితే మాల్దీవులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే వాతావరణ మార్పులపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం నీళ్లలో క్యాబినెట్‌ మీటింగ్‌ను నిర్వహించింది. ఆ దేశ అధ్యక్షునితో పాటు 13 మంది మంత్రులు, ఇతర అధికారులు స్క్యూబా డైవింగ్‌ దుస్తులు ధరించి సముద్ర గర్భంలో మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు.  
  3. ఇది ఆసియాలో అతి చిన్న దేశం. అత్యంత సురక్షితమైన పర్యాటక ప్రదేశం కూడా ఇదే. మాల్దీవుల్లో 80 దీవులు టూరిస్టు రిసార్టులుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 

Updated Date - 2021-05-10T06:03:26+05:30 IST