పాక్‌కు ఝలకచ్చిన మాల్దీవ్స్!

ABN , First Publish Date - 2020-05-23T16:13:29+05:30 IST

భారత్‌లో ముస్లిం వ్యతిరేకత పెరిగిపోతోదంటూ భారత్‌ను టార్గెట్ చేద్దామనుకున్న పాక్ ప్రయత్నాలకు గండిపడింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశంలో భారత్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలను ఏకం చేద్దామనుకున్న పాక్ ప్రయత్నాలకు మాల్దీవ్స్ గండి కొట్టింది.

పాక్‌కు ఝలకచ్చిన మాల్దీవ్స్!

న్యూఢిల్లీ: భారత్‌లో ముస్లిం వ్యతిరేకత పెరిగిపోతోదంటూ భారత్‌ను టార్గెట్ చేద్దామనుకున్న పాక్ ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశంలో భారత్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలను ఏకం చేద్దామనుకున్న పాక్ ప్రయత్నాలకు మాల్దీవ్స్ గండి కొట్టింది. భారత్‌లో ముస్లిం వ్యతిరేకత ఉందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఓఐసీలోని మాల్దీవ్స్ శాశ్వత ప్రతినిధి తిల్మీజా హుస్తేన్  స్పష్టం చేశారు. భారత్‌కు టార్గెట్ చేసుకునే ఎటువంటి ప్రయత్నాలకు మాల్దీవ్స్ మద్దతు ఇవ్వదు అని ఆమె స్పష్టం చేశారు. 57 సభ్య దేశాలతో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో  ఈ మేరకు తేల్చిచెప్పారు.


పనిగట్టుకుని కొందరు చేస్తున్న దుష్ప్రచారం, సోషల్ మీడియాలోని అసత్య ప్రచార కార్యక్రమాలు.. 130 కోట్ల మంది అభిప్రాయాలకు ప్రతిరూపంగా పరిణగించలేమని అన్నారు. ఆ కారణంగా భారత్‌పై నెపం మోపే ఎటువంటి ప్రయత్నాలకు మద్దతివ్వలేమని స్పష్టం చేశారు. ఓఐసీలో ప్రముఖ సభ్య దేశాలపై సౌదీ అరేబియా, యూఏఈ, ఆఫ్గనిస్థాన్, పాలస్తీనా వంటి దేశాలతో భారత్‌కు సన్నిహిత దౌత్యసంబంధాలు ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. ఆయా దేశాలు ప్రధాని మోదీని అత్యున్నత పౌర సత్కారాల ద్వారా గౌరవించిన విషయాన్ని కూడా హుస్సేన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్‌లో ముస్లిం వ్యతిరేకత పెరుగుతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో మాల్దీవ్స్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - 2020-05-23T16:13:29+05:30 IST