Abn logo
Aug 13 2020 @ 06:25AM

అడవిలో ఏనుగు కళేబరం లభ్యం

సంబాల్‌పూర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్రంలోని అడవిలో ఏనుగు కళేబరం వెలుగుచూసిన ఘటన సంచలనం రేపింది. ఒడిశా రాష్ట్రం సంబాల్ పూర్ జిల్లా ధామా ఫారెస్ట్ రేంజిలోని కేషపల్లి గ్రామం సమీపంలోని అడవిలో మూడేళ్ల వయసు గల ఏనుగు కళేబరం లభించింది. ఏనుగు కళేబరాన్ని పోస్టుమార్టం చేయించి, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ సంజీత్ కుామర్ చెప్పారు. జూన్ నెలలో మాధాపూర్ ఫారెస్ట్ రేంజ్ లోని ముందేశ్వర్ రిజర్వు ఫారెస్ట్ లో బుల్లెట్ గాయంతో ఓ ఏనుగు మరణించింది.బుల్లెట్ గాయం వల్లనే ఏనుగు మరణించిందని గతంలో జరిపిన పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఒడిశా అడవుల్లో ఇలా వరుసగా ఏనుగులు మరణించడంపై అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల మరణాలపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement
Advertisement