Abn logo
May 5 2021 @ 06:30AM

9మంది శిశువులకు జన్మనిచ్చిన మాలి మహిళ

బమాకో (మాలి): మాలి దేశానికి చెందిన 25 ఏళ్ల గర్భిణీ ఏకంగా 9మంది శిశువులకు జన్మనిచ్చింది. మాలి దేశానికి చెందిన 25 ఏళ్ల హలీమా సిస్సే గర్భం దాల్చడంతో వైద్యులు పరీక్షించి ఆమె ప్రసవానికి వైద్యనిపుణుల అవసరమని చెప్పి, ఆమెను మొరాకో ఆసుపత్రికి తీసుకువచ్చారు. మొరాకో ఆసుపత్రిలో హలీమా ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు సహా మొత్తం 9మంది శిశువులకు జన్మనిచ్చిందని మాలి దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సిబీ చెప్పారు. తల్లీ,నవజాత శిశువులు అందరూ బాగానే ఉన్నారని మంత్రి సిబీ వివరించారు. మొరాకో, మాలిలలో నిర్వహించిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రకారం సిస్సే కడుపులో ఏడుగురు శిశువులున్నారని గుర్తించారు. కాని సీజేరియన్ ఆపరేషన్ తర్వాత 9మంది శిశువులకు జన్మనివ్వడంతో వైద్యులే ఆశ్చర్యపోయారు. బహుళ జననాల్లో పుట్టిన శిశువులకు వైద్యసమస్యలు తరచూ తలెత్తవచ్చని వైద్యులు చెప్పారు.

Advertisement
Advertisement