మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ABN , First Publish Date - 2021-10-18T04:11:46+05:30 IST

మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చకుంటే ఉద్యమాలు చేపడుతామని ఆ సంఘం మండలాధ్యక్షుడు బాబురావు, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు.

మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
చింతలమానేపల్లిలో నినాదాలు చేస్తున్న మాలీ కులస్థులు

- మాలీ సంఘం మండలాధ్యక్షుడు బాబురావు

చింతలమానేపల్లి, అక్టోబరు 17: మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చకుంటే ఉద్యమాలు చేపడుతామని ఆ సంఘం మండలాధ్యక్షుడు బాబురావు, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మండలంలోని డబ్బా గ్రామంలో పూలే దంపతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాలీ సంఘం జెండాను ఆవిష్కరించారు. అధికార పార్టీ నాయకులు మాలీ సంఘం సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బాబురావు, జయంత్‌, పోశం, జన్నజీ, తదితరులు పాల్గొన్నారు. 

దహెగాం: మండలంలోని ఇట్యాల గ్రామంలో ఆదివారం మాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాలీల ఐక్యతా జెండా పండగను ఘ నంగా నిర్వహించారు. మాలీ సంఘం గ్రామ అధ్యక్షుడు మాట్లాడుతూ మాలీలు అభివృద్ధిఖి ఆమడ దూరంలో ఉన్నారన్నారు. మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు మాలీల ఐక్యతా జెండాను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో మాలీలు గ్రామ అధ్యక్షుడు భీంరావు, నాగేష్‌, భీమయ్య, తిరుపతి, భీమయ్య, నరేందర్‌, శంకర్‌, బిక్కు మేర భీంరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T04:11:46+05:30 IST