మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-24T01:56:37+05:30 IST

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం నరసింహారెడ్డికి

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి అరెస్ట్

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం నరసింహారెడ్డికి రూ.75 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. అనంతపురంలో 55 ఎకరాలు, సైబర్ టవర్స్ దగ్గర 4 ప్లాట్లు, హఫీజ్‌పేట్‌లో G+3 భవనం, రెండు ఇళ్ళు, రూ.15 లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో ఉప్పల్ సీఐగా నరసింహారెడ్డి పని చేశారు. పలు ల్యాండ్ సెటిల్మెంట్లు,  భూ వివాదాల్లో ఏసీపీ తల దూర్చినట్లు తెలుస్తోంది. నరసింహా రెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేశారు. హైదరాబాదులో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 

Updated Date - 2020-09-24T01:56:37+05:30 IST