Advertisement
Advertisement
Abn logo
Advertisement

మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం బాధాకరం: పవన్ కళ్యాణ్

హైదరాబాద్: మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అస్తమయం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శాస్త్రి గారు చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికీ చిరపరిచితమే అని పవన్ కల్యాణ్ తెలిపారు. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా... అధ్యాత్మిక చింతన పెంచేలా శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారి ఉపన్యాసాలు సాగేవి అని పవన్ చెప్పారు. ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెంచారన్నారు. చంద్రశేఖర శాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలియజేశారు. వారి కుటుంబానికి తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Advertisement
Advertisement