వైసీపీవి రైతు వ్యతిరేక విధానాలు

ABN , First Publish Date - 2020-10-25T11:19:20+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల తో ముందుకెళ్తోందని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి పేర్కొన్నారు.

వైసీపీవి రైతు వ్యతిరేక విధానాలు

 కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి


పులివెందుల, పులివెందుల రూరల్‌ 24:  వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల తో ముందుకెళ్తోందని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పులివెందులలో పర్యటించిన ఆయన ఇటీవల మృతిచెంది న పులివెందుల టీడీపీ నేత పుచ్చా వరప్ర సాద్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. టీడీపీ అండగా ఉంటుందని భరో సా కల్పించారు. అనంతరం ఆయన విలేక రులతో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ కి కార్యకర్తలే ఆస్తి అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉం టామన్నారు.


  వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రైతులకు భరోసా ను ఇవ్వలేకపోతోందన్నారు. సూక్ష్మనీటి సేద్యం పరికరాలతో రైతులు ఉద్యాన పం టలకు నీరు అందించేవారన్నారు.  ప్రస్తుతం అది మరుగునపడడంతో రైతు లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంద న్నారు. పంటలు నష్టపోయిన రైతులు బీమా పొందే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీరు-చెట్టు పనులకు ఇంత వరకు బిల్లులు చెల్లించకుండా ప్ర భుత్వం జాప్యం చేస్తోందన్నారు. అంతేకా కుండా టీడీపీ ప్రభుత్వంలో గోకులం, మినీ గోకులం షెడ్లు నిర్మించుకున్న పాడి రైతులకు ఇంత వరకూ బిల్లులు చెల్లించలే దన్నారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి భవనంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో లింగారెడ్డి సమావేశమయ్యారు. కార్యక్ర మంలో టీడీపీ నేత రాంగోపాల్‌రెడ్డి, మా ర్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు పార్థసార ధిరెడ్డి, రాఘవరెడ్డి, చాగలేరు భాస్కర్‌రెడ్డి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


చక్రాయపేటలో....

చక్రాయపేట, అక్టోబరు 24: టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే  మల్లెల లింగారెడ్డి, టీడీపీ నేత రామగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు గా యపడిన చిలేకాంపల్లె, మేకలవాండ్లపల్లె టీడీపీ నేత మాధవరెడ్డిని పరామర్శించా రు. అనంతరం నారపురెడ్డిగారిపల్లె టీడీపీ నేత భాస్కర్‌ రెడ్డి తల్లి మృతిచెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శిం చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రాఘవరెడ్డి, పార్థసా రధిరెడ్డి, బాలస్వామిరెడ్డి, శివమోహన్‌రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, చలపతి, చంద్ర, అశోక్‌, రామాం జులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T11:19:20+05:30 IST