Abn logo
Jun 17 2021 @ 22:42PM

మళ్లీ టీకా.. కొరత

రెండురోజులుగా జరగని వ్యాక్సినేషన

ఆసుపత్రులకు వచ్చి వెనుతిరుగుతున్న ప్రజలు

ప్రభుత్వం నుంచి జిల్లాకు సరఫరాకాని మందు

ఇప్పటికి 8.48 లక్షల మందికి వ్యాక్సిన

మరో 4 లక్షల మంది ఎదురుచూపు 


నెల్లూరు(వైద్యం) జూన 17 : కరోనా వ్యాక్సిన కోసం జిల్లావాసులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రెండు రోజులుగా వ్యాక్సిన వేయకపోవడంతో ప్రజలు కేంద్రాలకు వచ్చి తిరుగుముఖం పడుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి కొంతమేర తగ్గినా పాజిటివ్‌ కేసుల సంఖ్య 200 పైచిలుకు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా రికార్డుకెక్కుతున్నాయి. అయితే, వైరస్‌పై ప్రజల్లో అవగాహన రావడంతో వ్యాక్సిన వేయించుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. టీకా అందుబాటులో లేకపోవటంతో వెనుతిరగాల్సి వస్తోంది. ఇదేమిటని ఆయా కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నిస్తే తామేమి చేయలేమని వ్యాక్సిన వస్తే వేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం తగినంత వ్యాక్సినను జిల్లాకు సరఫరా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. సాధారణంగా జిల్లాకు రెండుస్లారు  మాత్రమే వ్యాక్సిన వస్తుంది. అదికూడా 25 వేల నుంచి 34వేల డోసుల వ్యాక్సిన మాత్రమే. వచ్చిన వ్యాక్సిన వచ్చినట్టు వేసేస్తుండటంతో కొరత ఏర్పడుతోంది. ఎప్పుడు వ్యాక్సిన వస్తుందో సరైన సమాచారం లేకపోవడంతో వ్యాక్సిన వేసే ఆసుపత్రుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి జిల్లాలో వ్యాక్సిన అందుబాటులో లేదు. జిల్లా ఉన్నతాధికారులు ప్రతి రోజు 25వేల మందికి టీకా వేస్తున్నామని చెబుతున్నా అది ప్రకటనలకే పరిమితమైంది. కేవలం 12వేలలోపు మందికే వ్యాక్సిన వేస్తున్నారు. మరోవైపు తమ ఆసుపత్రికి ఎంత వ్యాక్సిన వచ్చింది.. ఫలానా రోజు వేస్తాం.. 45 ఏళ్ల పైబడిన వారు రావాలి అన్న ప్రకటనల బోర్డులు కూడా ఆసుపత్రుల ముందు కరువయ్యాయి. 


8.48 లక్షల మందికి వ్యాక్సిన 


ఇప్పటివరకు జిల్లాలో 8,48,719 మందికి మాత్రమే  టీకా వేశారు. మరో 4 లక్షల మందికిపైగా 45 ఏళ్ల పైబడిన వారు ఎదురు చూస్తున్నారు. జనవరిలో కరోనా వ్యాక్సిన పంపిణీ ప్రారంభమవగా, తొలివిడతలో ప్రభుత్వం, ప్రైవేట్‌ వైద్యులు, సిబ్బంది. ఐసీడీఎస్‌ వంటి సిబ్బందికి వ్యాక్సిన వేశారు. రెండవ విడతలో పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు శాఖ ఉద్యోగులకు వేశారు. 3వ విడతలో 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వేశారు. ఉన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నాల్గవ విడత కింద 45 ఏళ్ల వారికి టీకా  వశారు. జిల్లాలోని 75 ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 14 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కావలి, గూడూరు ఏరియా ఆసుత్రులు, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి, నెల్లూరు జీజీహెచ ఆసుపత్రులలో ఈ వ్యాక్సిన వేస్తున్నారు. మొదట్లో ప్రజల్లో టీకాపై పెద్దగా అవగాహన లేకపోవడంతో విచ్చలవిడిగా దొరికేది. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. వ్యాక్సిన కోసం కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. రెండు రోజులుగా వ్యాక్సిన లేకపోవడతో వచ్చినవారు ఊసురోమని తిరుగుముఖ పడుతున్నారు.


వచ్చిన వ్యాక్సిన వేస్తున్నాం


జిల్లాకు వ్యాక్సిన తక్కువగా సరఫరా అవుతోంది. వస్తున్న వ్యాక్సినను వెంటనే కేంద్రాలకు తరలించి ప్రజలకు వేస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫస్ట్‌, సెకండ్‌ డోసు వ్యాక్సిన వేస్తున్నాము. ఇప్పటివరకు 8.48 లక్షల డోసుల వ్యాక్సిన వేశాము. జిల్లాలోని 45 ఏళ్ల పైబడిన వారందరికి వ్యాక్సిన వేసేలా కార్యాచరణ రూపొందించాం. జిల్లాకు వ్యాక్సిన చేరిన వెంటనే అర్హులైన వారికి వాక్సిన వేస్తాము.

- డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచవో