Sep 24 2021 @ 08:59AM

Mallika Sherawat: స్క్రీన్‌పై బోల్డ్‌గా నటిస్తే అలా అన్నారు

బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తాజాగా కాస్టింగ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె పలు హిందీ సినిమాలలో స్పెషల్ సాంగ్స్, విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఆమె పోషించే పాత్రలన్ని దాదాపు బోల్డ్‌గా ఉంటాయనే విషయం తెలిసిందే. ఐటెం సాంగ్స్‌లోనూ అందాల ఆరబోతకి ఏమాత్రం తగ్గదు. అందుకే మల్లికా శరావత్‌కు హిందీ సీమలో విపరీతమైన క్రేజ్ ఉంది. కాగా గత కొంతకాలంగా బాలీవుడ్, టాలీవుడ్ సహా మిగతా సౌత్ హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అవకాశాల పేరుతో తమని లైంగికంగా వేధింపులకు గురిచేశారని కొందరిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మల్లికా మాట్లాడుతూ, "నేను నేరుగా ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు. కానీ, చాలామంది నటులు నాతో క్లోజ్‌గా ఉండాలని చూశారు.. "మీరు తెరపై బోల్డ్‌గా నటించేటప్పుడు ఎలాగైతే ఉంటారో, ఆ తర్వాత కూడా మాతో అలాగే ఉండమని చెప్పారు. వారు ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌కి మధ్య తేడా ఒకటే అని భావించారు"..అంటూ చెప్పుకొచ్చారు. 

Bollywoodమరిన్ని...