Jun 3 2021 @ 22:51PM

వైరల్‌: మలయాళ నటి మార్ఫింగ్‌ ఫొటోలు!


మలయాళ నటి రమ్య సురేశ్‌ సైబర్‌ క్రైమ్‌ సెల్‌లో పిర్యాదు చేశారు. తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పోర్న్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన వారెవరో తెలియాలని, వారికి శిక్ష పడాలని ఆమె అలెప్పీ పోలీసులను కోరారు. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పొర్నోగ్రాఫిక్‌ వీడియో తనది కాదని, కావాలనే ఎవరో తన ఫేస్‌ను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ‘‘ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఫేషియల్‌ ఫీచర్స్‌ నా ఫీచర్స్‌ ఒకేలా ఉన్నాయి. నేను తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ తేడాను కనిపెట్టగలరు. పరిచయం లేనివారు నేను అనే అనుకుంటారు’’ అని రమ్య తెలిపారు. నయనతార నటించిన ‘నిళల్‌’ సినిమాలో రమ్య సురేశ్‌ నటించారు.