మల్లు వెంకటనర్సింహారెడ్డి జీవితం ఆదర్శం

ABN , First Publish Date - 2021-12-06T06:23:24+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మల్లు వెంకటనర్సింహారెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు.

మల్లు వెంకటనర్సింహారెడ్డి జీవితం ఆదర్శం
సూర్యాపేటలో మల్లు వెంకటనర్సింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న నాయకులు

సూర్యాపేట కల్చరల్‌/తిరుమలగిరి/తుంగతుర్తి/గరిడేపల్లి రూరల్‌, కోదాడ రూరల్‌, డిసెంబరు 5:తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మల్లు వెంకటనర్సింహారెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. వెంకటనర్సింహారెడ్డి 17వ వర్ధంతి సంద ర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన చిత్రపటాలకు సీపీఎం నాయకులు నివాళులర్పించారు. సూర్యాపేటలోని ఎంవీఎన్‌ భవ న్‌లో ఆయన చిత్రపటానికి మల్లు లక్ష్మి పూల మాలలు వేసి మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్క్సిస్టు పార్టీ నిర్మించడంలో కీలక భూమిక పోషించారన్నారు. జిల్లాకు కృష్ణా, గోదావరి, నడికుడి రైల్వే మార్గాన్ని సాధించడంలో ఎనలేని కృషి చేశారన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, ములకలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ఎల్గూరి గోవింద్‌ పాల్గొన్నారు.   మల్లు వెంకట నర్సింహారెడ్డి ఆశయాలు సాధించాలని సీపీఎం మండల కార్యదర్శి షేక్‌ యాకుబ్‌ అన్నారు. తిరుమలగిరి, తుంగతుర్తి కోదాడ మండల కేంద్రాల్లో,  గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఆదివారం నిర్వహించిన వెంకట నర్సింహారెడ్డి 17వ వర్ధంతిని నిర్వహించారు.  కీత వారిగూడెంలో యాకూబ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలక వీడు మండల కార్యదర్శి అనంత ప్రకాష్‌, తుమ్మల సైదయ్య, వెంకటేశ్వర్లు, రామస్వామి, శ్రీను, నారాయణ, లక్ష్మయ్య, అర్జున్‌, వెంకటాచారి, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్ర శ్రీనివాసులు, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, కడెం లింగ య్య, ఎర్ర గణేష్‌, పల్లా సుదర్శన్‌, ఎం.ముత్యాలు, కుక్కడపు నళిని, దాసరి శ్రీనివాస్‌, వెంకన్న, రాంబాబు పాల్గొన్నారు.

రాములమ్మ చిత్రపటానికి నివాళి

సీపీఎం నాయకుడు దివంగత సుందరి బిక్షమయ్య సతీమణి రాము లమ్మ దశదిన కర్మ సందర్భంగా కీతవారిగూడెంలో ఆమె చిత్రపటానికి షేక్‌ యాకూబ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. 



Updated Date - 2021-12-06T06:23:24+05:30 IST