మాల్వేర్‌ మెసేజెస్‌ వాట్సాప్‌తో వల

ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST

‘ఏదీ ఉచితంగా లభ్యం కాదు’ అన్న ఒక్క సూత్రాన్ని గుర్తుంచుకోని వ్యక్తులే తరచూ మోసపోతుంటారు. వాట్సాప్‌ మెసేసెస్‌ స్కామ్‌ కూడా ఇందుకు అతీతం కాదు.

మాల్వేర్‌ మెసేజెస్‌ వాట్సాప్‌తో వల

‘ఏదీ ఉచితంగా లభ్యం కాదు’ అన్న ఒక్క సూత్రాన్ని గుర్తుంచుకోని వ్యక్తులే తరచూ మోసపోతుంటారు. వాట్సాప్‌ మెసేసెస్‌ స్కామ్‌ కూడా ఇందుకు అతీతం కాదు. ఇంటి నుంచి పనిచేస్తున్న వ్యక్తులే టార్గెట్‌గా కొన్ని అదృశ్య శక్తులు మోసపూరిత మెసేజ్‌లతో వినియోగదారులను నిలువునా  ముంచుతున్నాయి. ‘మాతో చేరండి, రోజుకు రూ.50,000 సంపాదించండి’ వంటి మెసేజ్‌లతో తరచూ వలవేయడమే వీరిపని. ఒక్కోక్కది ఒక్కో స్కీమ్‌, మోసగించడమే వారి అసలు పని. అందుకు వాట్సాప్‌ను సైతం ఉపయోగించుకుంటున్నారు.


ఒక పత్రిక చేసిన సర్వే ప్రకారం లింక్‌ సహా మెసేజ్‌ మాల్వేర్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారుడు తన స్మార్ట్‌ఫోన్‌ క్లిక్‌ చేయగానే ఎటిఎం పిన్‌ నంబరు సహా అన్నీ అడిగేస్తుంది. చకచకా ఫాలో అయితే చాలు, అంతే వేగంగా మోసపోతుంటారు. అస్సలు తెలియని కాంటాక్టుల నుంచి ఈ మెసేజ్‌లు వస్తుంటాయి. సులువుగా మనీ సంపాదించవచ్చన్నది వీటి సారాంశం. కొవిడ్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎక్కువగా వీటి విషయంలో ఆకర్షితులవుతున్నారని తేలింది. ఇదే విషయమై సెక్యూరిటీ నిపుణులను అడిగనప్పుడు టెక్ట్స్‌ మెసేజ్‌కు తోడు ఫేక్‌ లాగిన్‌ పేజీకి సింగిల్‌ లింక్‌ ఉంటుందని చెప్పారు.  యాక్సెస్‌ కాగానే వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌లో మాల్వేర్‌ చేరుకుంటుంది. తదుపరి మోసం దానిదైన పద్ధతిలో జరిగిపోతుంది. ఈ మెసేజ్‌లను ఆపగలిగే లేదా సోర్స్‌ను కనిపెట్టే సౌలభ్యం ఇప్పటికైతే లేదు. వాటికి ఆకర్షితులు కాకపోవడం, సింపుల్‌గా విస్మరించడం ఒక్కటే తరుణోపాయమని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఒక్క రోజుల్లో పెద్ద మొత్తాలు సంపాదించుకోవడం సాధ్యంకాదనే ఆలోచనే ఇలాంటి మోసాలను నిరోధించగలదు. 

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST