పాస్‌వర్డ్‌ను దొంగిలించే మాల్వేర్లు?

ABN , First Publish Date - 2020-12-26T07:17:13+05:30 IST

పాస్‌వర్డ్‌ను దొంగిలించే మాల్వేర్ల గురించి వివరించగలరు...

పాస్‌వర్డ్‌ను దొంగిలించే మాల్వేర్లు?

  • పాస్‌వర్డ్‌ను దొంగిలించే మాల్వేర్ల  గురించి వివరించగలరు. 

  •                                                -  విశ్వనాథ్‌, హైదరాబాద్‌

కంప్యూటర్‌కి లేదా ఫోన్‌కి విభిన్న విధాలుగా నష్టం చేకూర్చే అనేకరకాల మాల్వేర్లు  రోజురోజుకు పెరుగుతున్నాయి.  వీటిలో పాస్‌వర్డ్‌ను దొంగిలించే మాల్వేర్ల గురించి  ఇటీవల బాగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవి ఒకసారి మన కంప్యూటర్‌లో ప్రవేశించిన తరవాత, మన గూగుల్‌ క్రోమ్‌, ఫైర్‌ ఫాక్స్‌ వంటి బ్రౌజర్లలో సేవ్‌ చేసిన పాస్వర్డ్‌లు,  ఆటో ఫిల్‌ డేటా, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను దొంగిలిస్తాయి. వీటిలో కొన్ని రకాల మాల్వేర్లు బ్రౌజర్‌ కుకీలను,  కంప్యూటర్‌లోని కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల నుంచి ముఖ్యమైన ఫైళ్లను దొంగలిస్తాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే వీలైనంతవరకూ ప్రమాదకరమైన అప్లికేషన్లకు దూరంగా ఉండటం మంచిది.

Updated Date - 2020-12-26T07:17:13+05:30 IST