కోడలిని హతమార్చిన మామ

ABN , First Publish Date - 2021-12-03T16:25:47+05:30 IST

తిరుపత్తూర్‌ సమీపంలో కోడలిని హతమార్చిన మామ పోలీసులకు లొంగిపోయాడు. నాట్రాంపల్లి సమీపం జంగళాపురంకు చెందిన మణి (60) భార్య ద్రాక్షాయణి గత ఏడాది మరణించింది. అతని కొడుకు కుశివన్‌

కోడలిని హతమార్చిన మామ

వేలూరు(చెన్నై): తిరుపత్తూర్‌ సమీపంలో కోడలిని హతమార్చిన మామ పోలీసులకు లొంగిపోయాడు. నాట్రాంపల్లి సమీపం జంగళాపురంకు చెందిన మణి (60) భార్య ద్రాక్షాయణి గత ఏడాది మరణించింది. అతని కొడుకు కుశివన్‌ కశ్మీర్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య మురుగమ్మాళ్‌ (32), ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. 2018లో గజనాయకన్‌ పట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో మురుగమ్మాళ్‌ ఉపాధ్యాయురాలుగా ఉండగా, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిందని విచారణలో తేలడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. విద్యాశాఖ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన నాట్రాంపట్లి పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం ఆమె జైలు నుంచి విడుదల కాగా, భార్యాభర్తల మధ్య ఏర్పడిన తగాదాల కారణంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకొని  పిల్లలతో వేరుగా నివసిస్తోంది. ఆ ప్రాంతానికి చెందిన కొందరితో మురుగమ్మాళ్‌కు సంబంధం ఉందని మామ మణి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో, భర్తతో విడాకులు కోరుతూ మురుగమ్మాళ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో, బుధవారం రాత్రి ఆమె జంగళాపురంలోని భర్త ఇంటికి వచ్చింది. విడాకుల కేసు విచారణలో ఉన్న సమయంలో ఎందుకు వచ్చావని మామ మణి ఆమెను నిలదీయడంతో ఇరువురు మధ్య వివాదం చోటుచేసుకుంది. చుట్టుపక్కల వారు వారిని సమాధానపరిచారు. రాత్రికి ఇంట్లోనే ఉన్న మురుగమ్మాళ్‌ గురువారం ఉదయం ఇంట్లో పాలు కాస్తున్న సమయంలో మామ ఆమెపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. అనంతరం ఆయన నాట్రాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మురగమ్మాళ్‌ పలువురితో అక్రమ సంబంధాలున్నాయని, దీనిని  సహించలేక ఆమెను హత్యచేసినట్టు మణి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-12-03T16:25:47+05:30 IST