ఓటర్లను సీఆర్పీఎఫ్‌ వేధిస్తోంది

ABN , First Publish Date - 2021-04-08T07:13:32+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ, ఓటర్లపై దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మహిళలను వేధిస్తున్నారన్నారు. సీఆర్పీఎఫ్‌, సీఐఎ్‌సఎ్‌ఫతో పాటు

ఓటర్లను సీఆర్పీఎఫ్‌ వేధిస్తోంది

అమిత్‌ షా ఆదేశాల మేరకు దాడులు: మమత


కోల్‌కతా, ఏప్రిల్‌ 7: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ, ఓటర్లపై దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మహిళలను వేధిస్తున్నారన్నారు. సీఆర్పీఎఫ్‌, సీఐఎ్‌సఎ్‌ఫతో పాటు బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ జవాన్లు దాడులు, వేధింపులకు పాల్పడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాల ప్రకారమే ఈ చర్యలకు పాల్పడుతున్నార ని చెప్పారు. కాగా, బెంగాల్‌లో ఏప్రిల్‌ 10న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సింగూర్‌లో అమిత్‌ షా రోడ్‌ షో నిర్వహించారు. 200 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, కోల్‌కతాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 26, 29న ఎన్నికల విధు ల్లో పాల్గొనాల్సి ఉన్న రిటర్నింట్‌ అధికారులను ఈసీ బదిలీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. 

Updated Date - 2021-04-08T07:13:32+05:30 IST