నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం: మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2021-10-03T21:16:40+05:30 IST

2016లో భవానీపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్‌మున్సి భార్య దీపా దాస్‌మున్సీ చేతిలో 25,301 ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. అనంతరం 2011లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నేత నందిని ముఖర్జీపై 54,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక తాజా ఎన్నికలకు వస్తే..

నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం: మమతా బెనర్జీ

కోల్‌కతా: భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలుపు ఖాయమైంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ గెలుపుకు కావాల్సిన ఓట్లు ఇప్పటికే వచ్చేశాయి. అయితే ఈ విషయమై మమతా బెనర్జీ స్పందిస్తూ ‘‘నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం చెప్పింది’’ అని వ్యాఖ్యానించారు.


‘‘దేశంలోని తల్లులకు, సోదరసోదరీమణులకు అందరికీ కృతజ్ణతలు. 2016లో కొన్ని వార్డుల్లో మాకు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. భవానీపూర్‌లో 46 శాతం బెంగాల్‌కు చెందని వారే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు నాకు ఓటు వేశారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మమ్మత్ని అధికారం నుంచి తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతోంది. నా కాలికి కూడా గాయమైంది. మాపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి గర్వంగా ఉంది. ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్‌కు కృతజ్ణతలు’’ అని మమతా బెనర్జీ అన్నారు.


2016లో భవానీపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్‌మున్సి భార్య దీపా దాస్‌మున్సీ చేతిలో 25,301 ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. అనంతరం 2011లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నేత నందిని ముఖర్జీపై 54,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక తాజా ఎన్నికలకు వస్తే.. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.

Updated Date - 2021-10-03T21:16:40+05:30 IST