Abn logo
Aug 2 2021 @ 20:05PM

mamatha Banerjee: ‘ఖేలాహోబే’ దేశమంతా విస్తరిస్తుంది

కోల్‌కతా : ‘ఖేలాహోబే’ నినాదాన్ని దేశమంతా అనుసరిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ నినాదం బాగా పాపులర్ అయ్యిందని, రానున్న రోజుల్లో దేశమంతా విస్తరిస్తుందని జోస్యం చెప్పారు. మొత్తం దేశానికి బెంగాల్ మార్గనిర్దేశకత్వం వహించడానికి తామెంతో గర్వపడతామని అన్నారు. ‘‘ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా... ఖేలాహోబే చాలా పాపులర్ నినాదం. దేశమంతా మార్మోగింది. యూపీ, రాజస్థాన్‌లో కూడా ఈ నినాదం విస్తరించింది.’’ అని మమత పేర్కొన్నారు.