Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 7 2021 @ 15:53PM

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ

కోల్‌కతా: భవానీపూర్ ఉప ఎన్నికలో గెలిచిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీప్ ధనకర్ సమక్షంలో మమతతోపాటు టీఎంసీ నేతలు అమీరుల్ ఇస్లామ్, జాకీర్ హొసైన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమత ఎమ్మెల్యేగా గెలవడం అనివార్యమైంది. దీంతో భవానీపూర్ నుంచి బరిలోకి దిగారు. గత నెల 30న భవానీపూర్‌తోపాటు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్, షంషేర్‌గంజ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ బరిలోకి దిగగా.. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ నేత ప్రియాంక టిబ్రేవాలా పోటీ చేసి 58 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement