ఓటు వేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2021-09-30T21:49:42+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని భవానీపూర్‌లో గురువారం మద్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ బూత్‌కి వెళ్లి తన ఓటు వేశారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు

ఓటు వేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని భవానీపూర్‌లో గురువారం మద్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ బూత్‌కి వెళ్లి తన ఓటు వేశారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నిక ఫలితాలు అక్టోబర్ 3వ తేదీన విడుదల కానున్నాయి. కాగా, భవానీపూర్‌ నుంచి మమతా బెనర్జీనే బరిలో ఉండడం గమనార్హం. ఈ యేడాది ఏప్రిల్-మేలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ్ నుంచి సువేందుపై పోటీ చేసి మమతా బెనర్జీ ఓడిపోయారు. అయితే టీఎంసీ మాత్రం ఘన విజయం నమోదు చేసుకుంది.

Updated Date - 2021-09-30T21:49:42+05:30 IST