బెంగాల్‌ను విడదీయాలని బీజేపీ చూస్తోంది: మమత ఫైర్

ABN , First Publish Date - 2021-04-03T22:32:23+05:30 IST

రాష్ట్రంలో ఉన్న మైనారిటీ సోదరసోదరీమణులకు నేనొక విజ్ణప్తి చేస్తున్నాను. విభజన రాజకీయ వాదులకు ఓటు వేయకండి’’ అని శనివారం ఉత్తర 24 పరగణాస్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత పేర్కొన్నారు.

బెంగాల్‌ను విడదీయాలని బీజేపీ చూస్తోంది: మమత ఫైర్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను విడదీయాలని భారతీయ జనతా పార్టీ చూస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లో మరో ‘బాంగ్ భంగ్ మూమెంట్’ (1905నాటి బెంగాల్ విభజన నేపధ్యం నాటి ఉద్యమం) తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె దుయ్యబట్టారు. అంతే కాకుండా ఇక్కడి భాషపై, సంస్కృతిపై దాడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు.


‘‘బాంగ్ భంగ్ మూమెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. అదే పరిస్థితులు నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. బెంగాల్‌ను విడదీయడానికి భారతీయ జనతా పార్టీ సర్వ శక్తులా ప్రయత్నిస్తోంది. బెంగాల్‌ను అంత మొందించాలని వీళ్లు అనుకుంటున్నారు. ఇక్కడి భాష, ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న మైనారిటీ సోదరసోదరీమణులకు నేనొక విజ్ణప్తి చేస్తున్నాను. విభజన రాజకీయ వాదులకు ఓటు వేయకండి’’ అని శనివారం ఉత్తర 24 పరగణాస్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత పేర్కొన్నారు.

Updated Date - 2021-04-03T22:32:23+05:30 IST