సీజనల్‌ వ్యాధులపై జగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2020-05-11T10:36:15+05:30 IST

సిజనల్‌వ్యాధులపై పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటిం చాలని మున్సిపల్‌ చైర్మన్‌ చిట్టిరెడ్డి మమతారెడ్డి సూచించారు.

సీజనల్‌ వ్యాధులపై జగ్రత్తగా ఉండాలి

పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి


పెద్దపల్లిటౌన్‌, మే 10: సిజనల్‌వ్యాధులపై పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటిం చాలని మున్సిపల్‌ చైర్మన్‌ చిట్టిరెడ్డి మమతారెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆదివారం 21, 12వ వార్డుల్లో వ్యాధుల నివారణ కార్యక్రమం ప్రారంభించారు. పట్టణ ప్రజలు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10నిమి షాలపాటు ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చే శారు. శుభ్రం చేసే ఫొటోలను 9100902361 నంబర్‌కు ఎక్కువసార్లు పంపిన వారిని బెస్ట్‌సిటిజన్‌గా గుర్తిస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ చాడల తిరు పతి, వైస్‌చైర్మన్‌ నాజ్మిన్‌ సుల్తానా, సురేష్‌, అమ్రీష్‌ తదితరులున్నారు. 


మంథనిలో..

మంథని, మే 10: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ పి లుపు మేరకు మంథని పట్టణంలో దస్‌ భజే.. దస్‌ మినెట్‌ కార్యక్రమానికి ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, ఇన్‌చార్జి కమిషనర్‌ అనుపమారావు ఆదివారం శ్రీకారం చుట్టారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బందికి గద్దలపల్లి పీహెచ్‌ డాక్టర్‌ శంకర్‌దేవి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


సుల్తానాబాద్‌లో..

సుల్తానాబాద్‌, మే 10: ఆదివారం పరిశుభ్రత దినోత్సవంగా పాటించాలని కోరుతూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీత, వైస్‌చైర్‌పర్సన్‌ బిరుదు సమత, కమిషనర్‌ ఇంటింటికీ వెళ్లి నిలువ ఉన్న నీటిని పారబోయించారు. అన్ని వార్డు ల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. 


గోదావరిఖనిలో..

కోల్‌సిటీ, మే 10: మున్సిపల్‌ శాఖ మంత్రి పిలుపు మేరకు ఆదివారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ‘ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు పది నిమిషాలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్‌ అనీల్‌కుమార్‌, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ ఎయిర్‌కూలర్‌లో నిల్వ నీటిని పారబోశారు. కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో నిలిచిన నీటిని తొలగించారు. 


కళ్యాణ్‌నగర్‌, మే 10: రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన ఇంట్లో నిల్వ ఉన్న నీటిని తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Updated Date - 2020-05-11T10:36:15+05:30 IST