Abn logo
Sep 24 2021 @ 17:58PM

సీపీఎం చాలా అన్యాయాలు చేసింది: మమత బెనర్జీ

కోల్‌కతా: భారత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) అధికారంలో ఉన్నప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఎన్నో జరిగాయని అయితే ఏ ఒక్కదానిపై సీబీఐ విచారణ కానీ, ఈడీ విచారణ కానీ జరగడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ ప్రభుత్వం నిజాయితీగా, నిష్పాక్షికంగా పాలించినప్పటికీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం భవానీపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయంలో మండిపడ్డారు.


‘‘ఎన్నికల ఫలితాల అనంతరం ఒక బీజేపీ కార్యకర్త చనిపోయాడని విన్నాను. ఇలాంటి మరణాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ శవాన్ని తీసుకుని నా ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఇదెక్కడి చోద్యం? ఎన్‌‌ఆర్‌సీ పేరుతో అస్సాంలో అనేక మంది హత్యకు గురవుతున్నారు. వీటన్నిటిపై బీజేపీకి కొంచెమైనా సిగ్గనిపించదా? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతిభద్రలు ఏమాత్రం లేవనడానికి ఇవే నిదర్శనం. బీజేపీ కావాలనే అల్లర్లు సృష్టిస్తోంది. ప్రతిరోజు ఏదో విధ్వంసానానికి, హింసకు, అల్లర్లకు పాల్పడుతూనే ఉంటారు. సొంత ఇళ్లపైనే బాంబులు వేసుకునేంతకు దిగజారారు. వాళ్లను తాకలంటేనే మేము భయపడుతున్నాం. వాళ్లపై మరి ఎవరు చేస్తారు? టీఎంసీ అలాంటి పార్టీ కాదు, మా పార్టీలో గూండాలు లేరు’’ అని మమతా బెనర్జీ అన్నారు.


అనంతరం బెంగాల్‌లో సీపీఎం పాలన గురించి మాట్లాడుతూ ‘‘చట్ట వ్యతిరేకమైన పనులు సీపీఎం చాలా చేసింది. కానీ ఏ ఒక్కదానిపై సీబీఐ విచారణ కానీ, ఈడీ విచారణ కానీ జరగడం లేదు ఎందుకని? మా పార్టీ నిజాయితీవైపు ధైర్యంగా నిలబడి పోరాడుతుంది. మేము ఎవరికీ భయపడం. మా ఫోన్లు పెగాసస్ ద్వారా టాపింగ్ చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మాపైకి ఉసిగొలుపుతున్నారు. అయినా మేం ఎవరికీ తలొంచేది లేదు’’ అని మమతా బెనర్జీ అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption