స్నేహితుడిని ప్రేమిస్తుందని కూతుర్ని చంపిన తండ్రి

ABN , First Publish Date - 2020-08-07T11:50:43+05:30 IST

తన కుమార్తె స్నేహితుడిని ప్రేమిస్తుందనే కోపంతో ఆమెను చంపిన కసాయి తండ్రి బాగోతం...

స్నేహితుడిని ప్రేమిస్తుందని కూతుర్ని చంపిన తండ్రి

రాజ్‌కోట్ (గుజరాత్): తన కుమార్తె స్నేహితుడిని ప్రేమిస్తుందనే కోపంతో ఆమెను చంపిన కసాయి తండ్రి బాగోతం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ నగరంలో వెలుగుచూసింది. రాజ్ కోట్ నగరంలోని గాంధీగ్రామ్ ప్రాంతంలో గోపాల్ నకూం, అతని కుమార్తె ఇలా నివాసముంటున్నారు. తల్లి నెలక్రితం మరణించింది. తన కుమార్తె స్నేహితుడిని ప్రేమిస్తుందనే కోపంతో తండ్రి గోపాల్ కుమార్తెను హత్య చేశాడు. ఇటీవల ప్రియుడితో కలిసి కుమార్తె లేచి పోయిందని తండ్రి కుమార్తెతో గొడవ పడ్డాడు. అనంతరం తండ్రి గోపాల్ బ్యాట్ తీసుకొని కుమార్తె ఇలాను కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-07T11:50:43+05:30 IST