Abn logo
Nov 17 2020 @ 08:23AM

సీఎంకే బెదిరింపు మెసేజ్..యువకుడి అరెస్ట్

Kaakateeya

పనాజీ (గోవా): గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను బెదిరిస్తూ సందేశాలు పంపిన యువకుడిని గోవా పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ గోవాలోని సాంకోలే గ్రామవాసి ఆశిష్ నాయక్ ఇంటర్నేషనల్ ఫోన్ నంబరు నుంచి సీఎం ప్రమోద్ సావంత్ ను దూషిస్తూ, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ మెసేజులు పంపించాడు. దీనిపై సీఎం ప్రమోద్ సావంత్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడైన ఆశిష్ నాయక్ ను అరెస్టు చేశారు. నిందితుడు ఆశిష్ నాయక్ సీఎంతోపాటు పలువురు ప్రముఖులను బెదిరస్తూ సందేశాలు పంపించాడని, వారి నుంచి డబ్బు డిమాండు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వ్యక్తిగత శత్రువు అయిన వ్యక్తి నంబరు నుంచి సీఎంను బెదిరించాడని పోలీసులు చెప్పారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement