సీఎంని ‘‘చంపేస్తానంటూ’’ బెదిరింపులు.. యువకుడి అరెస్ట్...

ABN , First Publish Date - 2020-05-24T05:22:32+05:30 IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ‘‘చంపేస్తానంటూ’’ బెదిరింపులకు దిగుతున్న ..

సీఎంని ‘‘చంపేస్తానంటూ’’ బెదిరింపులు.. యువకుడి అరెస్ట్...

ముంబై: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ‘‘చంపేస్తానంటూ’’ బెదిరింపులకు దిగుతున్న 25 ఏళ్ల ఓ యువకుడిని మహారాష్ట్ర ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. చునాబట్టికి చెందిన కమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిని కాలాచౌకి ఏటీఎస్ బృందం అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై మహారాష్ట్ర ఏటీఎస్ ఎస్పీ విక్రమ్ దేశ్‌మానే మాట్లాడుతూ.. ‘‘యోగి ఆదిత్యనాథ్‌ను ‘‘బాంబు పేల్చి చంపేస్తా’’నంటూ ఓ యువకుడు బెదిరిస్తున్నట్టు శుక్రవారం తెల్లవారు జామున ఉత్తర ప్రదేశ్ సోషల్ మీడియా హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదు అందింది. దీంతో గోమతి నగర్ పోలీస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ముంబై నుంచి ఫోన్ చేసినట్టు గుర్తించిన యూపీ పోలీసులు మహారాష్ట్ర ఏటీఎస్‌కు సమాచారం అందించారు. దీంతో కాలర్‌ను ట్రాక్ చేసి ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నాం...’’ అని పేర్కొన్నారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టి యూపీ పోలీసులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-05-24T05:22:32+05:30 IST