33 ఏళ్ల తర్వాత అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-01T20:29:46+05:30 IST

చట్టం చేతులు పెద్దవి... అన్నట్లు అత్యాచారం కేసులో నిందితుడిని 33 ఏళ్ల తర్వాత పట్టుకున్న శ్రీనగర్ పోలీసుల ఉదంతం...

33 ఏళ్ల తర్వాత అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

 జమ్మూ : చట్టం చేతులు పెద్దవి... అన్నట్లు  అత్యాచారం కేసులో నిందితుడిని 33 ఏళ్ల తర్వాత పట్టుకున్న శ్రీనగర్ పోలీసుల  ఉదంతం తాజాగా వెలుగుచూసింది. జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ జిల్లాకు చెందిన గులాం మొహద్ అలియాస్ గుల్లా 1988వ సంవత్సరంలో ఓ బాలికను అపహరించి అత్యాచారం జరిపాడు. ఈ కేసులో నిందితుడైన గులాం మొహద్ తానుంటున్న ప్రాంతాన్ని, గుర్తింపును మార్చి పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. కోర్టులో గులాంపై చార్జిషీటు సమర్పించినా నిందితుడు దొరకలేదు. ఖేర్ కోట్ బనిహాల్ కు చెందిన గులాం మొహద్ భూగర్భంలో ఉన్నాడని అతను 1988 మహూర్ పోలీసుస్టేషనులో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. వాంటెడ్ క్రిమినల్ అయిన గులాం తప్పించుకొని తిరుగుతున్నాడు. 33 ఏళ్ల తర్వాత నిందితుడు గులాం పాదముద్రలను  పోలీసులు గుర్తించారు.పోలీసులు గులాంను అరెస్టు చేసి ఎట్టకేలకు కోర్టులో ప్రవేశపెట్టారు. అత్యాచారం ఘటన జరిగి 33 ఏళ్ల తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 

Updated Date - 2021-05-01T20:29:46+05:30 IST