Abn logo
Jun 23 2021 @ 17:23PM

ఈ పాము ఖరీదు రూ.15 లక్షలు.. అమ్మబోతుండగా పోలీసులు పట్టేశారు..

ఆ పాముకు అతీంద్రీయ శక్తులు ఉన్నాయని నమ్ముతారు.. అది ఎవరి దగ్గర ఉంటే వారు ధనవంతులవుతారని, వారి శత్రువులు నాశనమవుతారని, రహస్యంగా ఉన్న నిధిని అది కనుగొంటుందని కూడా నమ్ముతారు.. మొత్తానికి ఆ పామును కలిగి ఉన్న వాళ్లను గొప్ప అదృష్టవంతులుగా భావిస్తారు.. ఆ పాము పేరు శాండ్ బోవా (మండుల్ అని కూడా పిలుస్తారు).


ఆ పామును అమ్మబోతున్నాడనే కారణంతో పుణెకు సమీపంలోని పంప్రి చించివాడ్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడిని అటవీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఆ యువకుడి ఇంటి మీద దాడి చేసిన అధికారులు అతడి అధీనంలో ఉన్న పామును స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్-1972 చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు. అతను ఎవరికి ఆ పామును అమ్మాలనుకున్నాడో విచారిస్తున్నారు. విష రహితమైన ఆ పాము ఖరీదు దాదాపు 15 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


ప్రత్యేకంమరిన్ని...