ప్లీజ్ అలా చేయండంటూ వేడుకున్న కస్టమర్.. అతడి కోరిక కాదనలేకపోయిన హోటల్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-09-30T03:17:08+05:30 IST

పని ఒత్తిడితో సతమతమైపోతున్న ఓ వ్యక్తి.. హోటల్‌కు వెళ్లి రిలాక్స్ అవుదాం అనుకున్నాడు. రెండు రోజులపాటు అక్కడే హోటల్‌లోనే ఉండి.. మిగిలిన ప్రపంచాన్ని మరిచిపోదాం అనుకున్నాడు. అయితే హోటల్‌కు వెళ్లిన తర్వాత తన ఆలోచనలను ఇతర విషయాల నుంచి మళ్లించడం కోసం ఓ ప్లాన్ వేశాడు. అందుకు ఆ హోటల్ సిబ్బంది ఒప్పుకుంటే తన పని సులువు అవుతుం

ప్లీజ్ అలా చేయండంటూ వేడుకున్న కస్టమర్.. అతడి కోరిక కాదనలేకపోయిన హోటల్.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: పని ఒత్తిడితో సతమతమైపోతున్న ఓ వ్యక్తి.. హోటల్‌కు వెళ్లి రిలాక్స్ అవుదాం అనుకున్నాడు. రెండు రోజులపాటు అక్కడే హోటల్‌లోనే ఉండి.. మిగిలిన ప్రపంచాన్ని మరిచిపోదాం అనుకున్నాడు. అయితే హోటల్‌కు వెళ్లిన తర్వాత తన ఆలోచనలను ఇతర విషయాల నుంచి మళ్లించడం కోసం ఓ ప్లాన్ వేశాడు. అందుకు ఆ హోటల్ సిబ్బంది ఒప్పుకుంటే తన పని సులువు అవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే ఆ హోటల్‌కు తన కోరికను తెలియజేస్తూ ఓ మెయిల్ పెట్టాడు. అయితే ఆ మెయిల్ చూసిన సిబ్బంది.. అతని కోరికను కాదనలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..



మెల్‌బోర్న్‌కు చెందిన థామస్ అనే వ్యక్తి.. టిక్‌టాక్‌లో చాలా ఫేమస్. కాగా.. గత కొన్ని రోజులుగా థామస్ పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో ఓ హోటల్‌కు వెళ్లి రెండు రోజులపాటు సరదాగా స్పెండ్ చేద్దాం అనుకున్నాడు. అయితే రూంలో ఒంటరిగా కూర్చుంటే.. వర్క్‌కు సంబంధించిన ఆలోచనలే మదిలో మెలుగుతాయని అనుకున్నాడు. పని నుంచి తన దృష్టిని మరల్చడం కోసం ఏదైనా ఆట విడుపు ఉంటే బాగుంటుందనుకున్నాడు. ఈ క్రమంలో తాను వెళ్లాలనుకునే హోటల్‌కు ఓ మెయిల్ పెట్టాడు. తాను రెండు రోజులపాటు హోటల్‌లో ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే తాను బుక్ చేసుకున్న రూంలో సిబ్బంది యాపిల్ పండ్లను దాచాలని మెయిల్ ద్వారా కోరాడు. కాగా.. అతడిని అర్థం చేసుకున్న సిబ్బంది.. థామస్‌ కోరికను కాదనలేకపోయారు. అతడి రూంలో ఏకంగా ఐదు యాపిల్ పండ్లను దాచుంచి.. అవి ఎక్కడ ఉన్నాయో కనుక్కోవాలంటూ ఓ చీటీలో సూచించారు. ఈ క్రమంలో హోటల్ రూంలో దిగిన థామస్.. రెండు రోజులపాటు హోటల్ సిబ్బంది దాచిన యాపిల్ పండ్లను వెతికే పనిలో పడి.. తన పని ఒత్తిడి నుంచి బయటపడ్డాడు. తాజాగా హోటల్ సిబ్బంది రాసుంచిన చీటీని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టిన థామస్.. వారికి ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-09-30T03:17:08+05:30 IST